ఆమ్ ఆద్మీ పార్టీ నా పేరును వాడడం తగదు: అన్నాహజారే
అధికారంలోకి వస్తే అన్నా జనలోక్ పాల్ బిల్లును తీసుకొస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించడం పట్ల సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చెప్పడం సరికాదన్నారు. బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిందని, ఢిల్లీ అసెంబ్లీ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. తన పేరును ఏ పార్టీ వినియోగించడం తనకిష్టం లేదన్నారు. తానే పార్టీతోనూ భాగస్వామిని కానని స్పష్టం చేశారు.